భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బాస్టీల్ డే పరేడ్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి వీక్షించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ అవార్డుతో మోదీని ఫ్రాన్స్ సత్కరించింది.
అనంతరం మెక్రాన్‌తో కలిసి ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఫ్రాన్స్ 16 మంది, భారత్ నుంచి 24 మంది సీఈవోలు హాజరయ్యారు. భారత్‌లో చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను మోదీ వారికి వివరించారు. భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూ చించారు. 25 ఏళ్లలో ఇరుదేశాల వ్యాపారులు పెద్ద పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యం మోదీ బహూకరించారు. ఆయన సతీమణికి పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీర అందించారు. ప్రధాని మోదీకి కూడా మెక్రాన్ దంపతులు పలు బహుమతులను అందించారు.
PM Narendra Modi gifted Pochampally Ikat in Sandalwood Box to France's First Lady Brigitte Macron
Pochampally silk ikat fabric, hailing from the town of Pochampally in Telangana, India, is a mesmerizing testament to India's rich textile heritage. Renowned for its intricate… pic.twitter.com/kWJvx2VKCJ
— ANI (@ANI) July 14, 2023
PM Narendra Modi gifted Sandalwood Sitar to French President Emmanuel Macron
The unique replica of the musical instrument Sitar is made of pure sandalwood. The art of sandalwood carving is an exquisite and ancient craft that has been practised in Southern India for centuries. pic.twitter.com/IUefiRLN65
— ANI (@ANI) July 14, 2023