నేడు జకార్తాకు ప్రధాని నరేంద్ర మోదీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించారు. ఇప్పుడు మరోవ విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు. ఆసియాన్‌-ఇండియా, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయలుదేరనున్నారని వెల్లడించారు.

గురువారం 20వ ఆసియాన్‌-ఇండియా, 18వ తూర్పు ఆసియా సదస్సులు జరగనున్నాయి. ఇందులో 10 దేశాలు పాల్గొంటాయి. సముద్ర తీరప్రాంత భద్రతలో సహకారంపై ఈ సదస్సుల్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఆసియాన్‌లో ఇండియాతోపాటు అమెరికా, చైనా, జపాన్‌, ఆస్ట్రేలియాలు చర్చల భాగస్వాములుగా ఉన్నాయి.

భారత్‌ భద్రత, వాణిజ్య అంశాలపై ఆయా నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. సదస్సులు ముగిసిన అనంతరం గురువారం రోజున సాయంత్రం ప్రధాని భారత్‌కు తిరిగిరానున్నట్లు వెల్లడించారు. మోదీ జకార్తా పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news