మెట్రోలో దిల్లీ వర్సిటీ శతాబ్ది వేడుకలకు వెళ్లిన మోదీ

-

దిల్లీ యూనివర్సిటీలో ఇవాళ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు జరగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన వర్సిటీకి వెళ్లేందుకు దిల్లీ మెట్రో రైలును ఎంచుకున్నారు. ఓ సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. ఈ క్రమంలో విద్యార్థులు, తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో సేవలపై ఆరా తీశారు.

దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. మరోవైపు బీజేపీ కూడా తన ట్విటర్​లో ఈ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

1922లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ చట్టం ప్రకారం దిల్లీ యూనివర్సిటీని స్థాపించారు. దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తించింది. 2022 నాటికి ఈ విశ్వవిద్యాలయానికి వందేళ్లు పూర్తవ్వడంతో గతేడాది మే 1వ తేదీన శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాది పాటు జరిగిన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news