ఏపీ​లో పైలట్ ప్రాజెక్ట్​తో కాంగ్రెస్ కుట్ర : ప్రధాని మోదీ

-

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జోష్ చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రాజస్థాన్ లో పర్యటించిన ఆయన టోంక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగానే ఉండేదన్నారు. ప్రజల ఆస్తులను లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచేందుకు ప్రయత్నిస్తోందన్న వాస్తవాన్ని బయటపెడితే, కాంగ్రెస్‌ ఎందుకు ఉలిక్కిపడుతోందని మోదీ నిలదీశారు.

“రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు రక్షణ కల్పించేందుకు మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. కానీ దేశ వనరులపై మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. తర్వాత దేశం మొత్తం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది.”
 – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news