కేసీఆర్‌ ఇప్పటికైనా అలర్ట్‌ కావాలి – విజయశాంతి

-

కేసీఆర్‌ ఇప్పటికైనా అలర్ట్‌ కావాలని విజయశాంతి ట్వీట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళుతున్న తరుణంలోనే.. విజయశాంతి చేసిన పోస్ట్‌ వైరల్‌ గా మారింది. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మొదటి సెక్రటరీ జనరల్ విజయశాంతిని అధ్యక్షులు కెసిఆర్ గారు కారణం చూపక , షోకాజ్ కనీసం ఇయ్యక పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒకప్పుడు ఎల్లగొట్టిన్రు అని ఎమోషనల్‌ అయ్యారు విజయశాంతి.

Vijayashanthi post on kk and kcr

ఇయ్యాల్టి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు ఆత్మగౌరవ రీత్యా ఆ పార్టీకి దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. తప్పులేడ జరిగినయో, అందరెందుకు దూరమైతున్నరో, కేసీఆర్ గారు తన ప్రభావం తానే ఏ కారణాలతో రోజు రోజుకి కోల్పోతున్నరో వారే విశ్లేషించుకోవటం అవసరమని సూచనలు చేశారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news