pm modi on Jammu and Kashmir Assembly elections begins : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైన తరుణంలో.. ప్రధాని నరేంద్ర మోడీ సంచలన పోస్ట్ పెట్టారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైనందున, ఈ రోజు పోలింగ్‌కు వెళ్లే నియోజకవర్గాల్లోని వారందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను కోరుతున్నానని పేర్కొన్నారు.

నేను ముఖ్యంగా యువకులు మరియు మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నానని ప్రకటించారు ప్రధాని మోడీ. కాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 90 నియోజకవర్గాలకు గానూ తొలివిడతలో 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.. 7 జిల్లాల్లో తొలి విడత బరిలో 219 మంది అభ్యర్థులు ఉన్నారు.. కశ్మీర్‌లో 16, జమ్మూలో 8 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.