ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా మద్యం పాలసీపై సంచలన నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినేట్. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చ జరుగనుంది.

మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను సమీక్షించనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ బృందం. అలాగే… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై ఆమోద ముద్ర వేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ బృందం. అటు వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటి పైనా కేబినెట్‌లో ప్రస్తావన రానుంది.