కేవలం 22 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మహిళల సిందూరం చెరిపేసినవారిని మట్టిలో కలిపేశామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ మనసు చల్లగా ఉంటుంది.. కానీ, మోదీ రక్తం వేడిగా ఉంటుందన్నారు. రాజస్థాన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో 1300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేయాలని నిర్ణయించామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సిందూర్‌పై దేశ ప్రజలు గర్వపడుతున్నారని పేర్కొన్నారు మోదీ. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. కేవలం 22 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో త్రివిధ దళాలు సంయుక్తంగా సత్తా చాటాయని పేర్కొన్నారు. మహిళల సిందూరం చెరిపినవారిని మట్టిలో కలిపామని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ.