వారి మనోధైర్యానికి వందనం.. ఉత్తరాఖండ్ కూలీల రెస్క్యూపై మోదీ ఎమోషనల్

-

ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం రోజున ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు స్పందించారు. కూలీలు ప్రాణాలతో బయటపడటంతో హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. 17 రోజుల పాటు మనోధైర్యం కోల్పోకుండా ప్రాణాల కోసం దృఢసంకల్పంతో పోరాడిన కూలీలను మోదీ కొనియాడారు.

‘‘విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోంది. చరిత్రలో అత్యంత కష్టతరమైన ఈ సాహస ప్రయత్నంలో ఎంతో తెగువ, నిబద్ధత చూపిన నిపుణులు, సహాయక సిబ్బందికి అభినందనలు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘‘

“ఈ మిషన్‌లో భాగస్వాములైన ప్రతిఒక్కరూ అద్భుతమైన బృంద స్ఫూర్తికి, మానవతకు నిదర్శనంగా నిలిచారు. వారికి సెల్యూట్‌ చేస్తున్నా. సిబ్బంది చూపిన ధైర్యం, సంకల్పం కార్మికులకు కొత్త జీవితాలను ప్రసాదించింది. కార్మికుల కుటుంబాలు చూపిన సహనం, ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే” అంటూ ప్రధాని అభినందనలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news