ప్రశాంతంగా పోలింగ్.. ఈసీపై ప్రధాని మోదీ ప్రశంసలు

-

లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈసీని అభినందించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల ఎన్నికలను దాదాపు హింస లేకుండా ఎన్నికల కమిషన్ నిర్వహించిందని కొనియాడారు.

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదువుతున్నందున మీడియా ప్రతినిధులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాని సూచించారు. మీడియా ప్రతినిధులు పగలూరాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని.. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండని చెప్పారు. భారత ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాలు ఒక కేస్ స్టడీ చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు దేశానికి చాలా ప్రాముఖ్యమైనవని.. అందుకే ప్రజలంతా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news