22న ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించండి : మోదీ

-

జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కన్నులపండువగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. ప్రపంచమంతా శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వేడుకను కళ్లారా చూసేందుకు దేశనలుమూలల నుంచి ప్రజలు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ఓ కీలక సందేశాన్ని ఇచ్చారు.

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజును దేశమంతా దీపావళి పండగలా నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆరోజున ఇంటింటా శ్రీరామ జ్యోతిని వెలిగించాలని సూచించారు. ఆ రోజున అయోధ్యకు ఎవరూ రావొద్దని, ఆహ్వానం ఉన్నవారే హాజరు కావాలని అన్నారు. జనవరి 14 నుంచి 22 మధ్య దేశంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో స్వచ్ఛ కార్యక్రమం చేపట్టాలని ప్రజలందరిని కోరారు. గతంలో శ్రీరాముడు టెంట్‌ కిందే ఉండేవారని, ఇప్పుడు 4 కోట్లమంది పేద ప్రజలు సమకూర్చుకున్నట్లుగా శ్రీరాముడు కాంక్రీట్‌ ఇంటిని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version