2024లో భారత్​లో 100 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు! : ప్రధాని మోదీ

-

దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎన్నికలు కాబోతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆ ఎన్నికల్లో 100 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగంచుకోనున్నారని తెలిపారు. దిల్లీలో జరుగుతున్న జీ-20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..  దేశంలో జరగనున్న ఈ అతిపెద్ద ఎన్నికలను చూసేందుకు భారత్​కు రావాలని పీ20 ప్రతినిధులందరినీ మోదీ ఆహ్వానించారు.

ఈవీఎంల వినియోగం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను.. సామర్థ్యాన్ని పెంచిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపు జరిగిన కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడిస్తున్నామని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ  పార్టీని వరుసగా రెండోసారి గెలిపించారని చెప్పారు.  2024లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు జరగనున్నాయన్న ప్రధాని.. భారత్​ ఇప్పటివరకు 17 సాధారణ ఎన్నికలు, 300 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిందని వెల్లడించారు. భారతదేశ పార్లమెంటరీ పద్ధతులు కాలక్రమేణా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.

భారత్స రిహద్దులో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని.. ఉగ్రవాదం ఎంత పెద్ద సవాలో ప్రపంచ ఇప్పుడు గ్రహించిందని మోదీ అన్నారు. ఉగ్రవాదం ఎక్కడైనా, ఏ రూపంలో కనిపించినా మానవత్వానికి విరుద్ధమని పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version