భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. జూన్ 8వ తేదీన ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాలు హాజరు కానున్నాయి. ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు (272)ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేస్తే తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేసినవారు అవుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాల నేతలు హాజరుకానున్నారు. ఈ సాయంత్రం జరిగే ఎన్డీఏ పక్షాల భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు,ప్రధాని ప్రమాణ స్వీకారంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.