రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మక్తాలో ఆరేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఆడుకోవడానికి వెళ్లిన సాత్విక్ నిన్న రాత్రి నుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం కనిపించింది. శరీరంపై కుక్కలు దాడి చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. మియాపూర్ లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన బాలుడు సాత్విక్ (6) అని పోలీసులు చెబుతున్నారు. ఆడుకుంటూ వెళ్లి నిన్న రాత్రి నుండి కనబడకుండా పోయిన బాలుడు సాత్విక్(6)….ఈరోజు ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యం అయినట్లు పోలీసులు వివరించారు.