పంజాబ్ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కొంత మంది అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాన మంత్రి మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అంతే కాకుండా ఈ ఘటన పై సుప్రీం కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. అయితే తాజా గా పంజాబ్లో ప్రధాని కాన్వాయ్ నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించింది.
అలాగే ఈ కేసు విచారణ కూడా జరపవద్దని సుప్రీం కోర్టు న్యాయమూర్తులను బెదిరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీం కోర్టు ధర్మాసనాకి తెలిపింది. తమను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని దర్యాప్తును నిలిపివేయాలంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తెలిపారు. ఖలిస్థానీ వేర్పాటు వాద సంస్థ అయిన సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు.