ఫ్రాన్స్, అమెరికాలో ప్రధాని మోడీ పర్యటించనుంది. నేటి నుంచి 4 రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగానే నేడు, రేపు ఫ్రాన్స్‌లో మోడీ టూర్ కొనసాగనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొననున్నారు మోడీ.. థర్మో న్యూక్లియర్ యాక్టర్‌ను సందర్శించనున్న భారత ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ పర్యటన తర్వాత ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు మోడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్నారు ప్రధాని మోడీ.
డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్న ప్రధాని మోదీ.. కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని మోదీ… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్‌ను కూడా కలుసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 13న ట్రంప్‌తో భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.