ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా.. హైడ్రాపై హైకోర్టు సీరియస్

-

వీకెండ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు మరోసారి హైడ్రా మీద సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏమిటి? ఒక్క రోజులో డాక్యుమెంట్స్ సమర్పించడం ఎలా సాధ్యం అవుతుందని కోర్టు చీవాట్లు పెట్టింది.

అయితే, తన ఆస్తులను అక్రమంగా కూల్చివేశారని హైకోర్టులో ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన సామ్రెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్..సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హైడ్రాను హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version