పార్లమెంట్​లో ‘ఛావా’ స్పెషల్ స్క్రీనింగ్!

-

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో తెలుగులోనూ రిలీజ్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లలో సూపర్ హిట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘ఛావా’ సినిమాను పార్లమెంట్​లో ప్రదర్శించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ లోని బాలయోగి ఆడిటోరియంలో గురువారం రోజున ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ఉండనున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ చిత్రాన్ని వీక్షించనున్నట్లు సమాచారం. ఈ నేతలతో పాటు ఛావా చిత్రబృందం కూడా ఈ స్క్రీనింగుకు హాజరు కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news