గుడ్‌న్యూస్‌.. జూన్‌ నుంచి UPI, ATM ద్వారా ‘పీఎఫ్‌ విత్‌డ్రా’

-

ఉద్యోగులు పీఎఫ్ నిధులు ఈజీగా విత్ డ్రా చేసుకునేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక సంస్కరణలు దిశగా అడుగులు వేస్తోంది. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా వెల్లడించారు.

2025 మే లేదా జూన్‌ నుంచి ఉద్యోగులు పీఎఫ్‌ నగదును ఏటీఎం, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ విధానంలో 1 లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. కోరుకున్న అకౌంట్‌కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చు. నగదు విత్‌డ్రా మాత్రమే కాకుండా.. పీఎఫ్‌లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకునే ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్‌ విత్‌ డ్రా ఆప్షన్‌ వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news