పీఎం సూర్య ఘర్‌ పథకం ప్రారంభం.. దరఖాస్తు చేసుకోవాలని ప్రధాని పిలుపు

-

సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా, సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రకటించింది. తాజాగా ఆ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంబంధిత pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -

‘‘మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నాం’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...