మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ తో కలిపి పీఎం
దక్ష్ మొబైల్ ఆప్ PM Daksh Mobile App మరియు పీఎం దక్ష్ పోర్టల్ ని అభివృద్ధి చేయడం జరిగింది. వీటిని యూనియన్ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డాక్టర్ వీరేంద్ర కుమార్ లాంచ్ చేశారు.
పీఎం దక్ష్ పోర్టల్ మరియు పీఎం దక్ష్ మొబైల్ యాప్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ని అందుబాటులో ఉంచడానికి తీసుకు రావడం జరిగింది. అయితే ఈ పోర్టల్ మరియు యాప్ వలన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన బెనిఫిట్స్ ని యువత పొందొచ్చు. ప్రధాన మంత్రి దక్ష్ యాప్ ని మరియు పోర్టల్ ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ 2020-2021 నుండి అమలు చేయడం జరిగింది. దీని ద్వారా యువతకి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రాం, లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రాం, ఈడీపీ (Entrepreneurship Development Program).
ఇలా ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి తెలుస్తుంది. ఇప్పుడు సులువుగా ఎవరైనా సరే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. కేవలం ఒక్క క్లిక్ తో దగ్గరలో జరిగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది అని డాక్టర్ వీరేంద్ర అన్నారు. అలానే ఈ యాప్ ని విడుదల చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని అన్నారు.
![PMdaksh Mobile App](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/08/PM-Daksh.jpg)
అవసరమైతే యాప్ ని మరింత ఇంప్రూవ్ చేస్తామని దీనితో చాలా మందికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి రెండు లక్షల మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చారు మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. 2021-2022 లో సుమారు 50 వేల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడమే మా లక్ష్యం అన్నారు. Download PMDaksh Mobile App
ఈ ప్రభుత్వ స్కీమ్స్ తో మీ డబ్బులని రెట్టింపు చేసుకోండి..!