అదిరిపోయే బిజినెస్ ఐడియా.. లక్షల్లో ఇన్‌కమ్.. ఎందులోనంటే?

-

సాధారణంగా ఉద్యోగం కంటే వ్యాపారమే బెస్ట్‌గా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అది నిజమే. కానీ, అందుకు సంబంధించిన బెస్ట్ ఐడియా ఉండాలి. పెట్టుబడి కూడా కావాలి. పరిస్థితులన్నిటినీ అంచనా వేసుకుని ముందుకు రంగంలో దిగితే బిజినెస్ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రముఖ సంస్థ గుడ్ న్యూస్ చెప్తోంది. లక్షల్లో ఆదాయం ఇచ్చేందుకు ఓ ఆప్షన్‌ను వారి ముందర ఉంచుతోంది. అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

generic aadhaar franchise

ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఐడియా ద్వారా తక్కువ పెట్టుబడితోనే ఫుల్ ఆదాయం పొందొచ్చట. అదే జెనరిక్ ఆధార్ ఫ్రాంచైజీ. ఈ స్టార్టప్‌లో భారతీయ దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇన్వెస్ట్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో వ్యాపారం చేయాలనుకునే వారు ‘జెనరిక్ ఆధార్’ ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల ఆదాయం పొందొచ్చు. ఇందుకుగాను రూ. లక్ష పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీ ద్వారా కంపెనీ పలు బెన్‌ఫిట్స్ కూడా ఇస్తుంది. ఈ కంపెనీ భాగస్వాములకు 40 శాతం వరకు మార్జిన్ అందిస్తుంది. ఫ్రాంచైజీ ద్వారా ఏడొందల రకాలకు పైగా జెనరిక్ మెడిసిన్స్ పొందొచ్చు. ఎవరైనా ఔషధాల కోసం ఆర్డర్ చేస్తే అవి మీ నుంచి మాత్రమే సప్లై అవుతాయి. మీరు వాటిని చూసి అవగాహన పొందొచ్చు.

అలాంటి మెడిసిన్స్ సప్లై చేయడానికి ప్లాన్ చేసుకుోవచ్చు. అయితే, మీకు వచ్చే ఇన్‌కమ్ సిటీ లేదా రూరల్ ఏరియా ప్రాతిపదికను బట్టి మాత్రమే ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ఇన్‌కమ్ అయితే రాదు. ఈ నేపథ్యంలో అన్ని విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకున్న తర్వాతనే ఫ్రాంచైజీ తీసుకుంటే మంచిది. మరిన్ని వివరాల కోసం ‘జెనరిక్ ఆధార్ డాట్ కమ్’ వెబ్ సైట్‌ను సంప్రదించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news