కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పీకే..రాహుల్‌గాంధీతో చర్చలు..!

-

రాహుల్ గాంధీ తో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసేందుకు గత ఏడాది ఇరువురి మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఆ తర్వాత మరలా విశాల ప్రయోజనాల కోసం ఇరువురి మధ్య సఖ్యత కుదిరినట్లు సమాచారం అందుతోంది.

కేవలం గుజరాత్ ఎన్నికల కోసం ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ సమ్మతించినట్లు సమాచారం. అయుతే, కాంగ్రెస్ పార్టీ తో ఏలాంటి అనుబంధం, బంధాలు లేకుండా కేవలం ఓ “ప్రొఫెషనల్” ( వృత్తి) గా పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

గుజరాత్ కాంగ్రెస్ నాయకులతో రాహుల్‌ గాంధీ నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఎన్నికల వ్సూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని గుజరాత్ కాంగ్రెస్ నేతలు సమావేశంలో వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కే విడిచి పెట్టినట్లు సమాచారం. అయుతే, ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు మాత్రం ఇది వాస్తవం కాదని కొట్టిపారేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version