అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న 11రోజుల దీక్షను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండుపుటల లేఖ రాశారు. భారత సంస్కృతి, ఆధ్యాత్మికత రాముడి జీవితంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. జాతి నిర్మాతలకు రామాయణం ఎంతో స్పూర్తిగా నిలిచిందని తెలిపారు. గాంధీజీ వంటి వారికి రాముడే స్ఫూర్తి అని.. అందుకే మహాత్మా గాంధీ తన చివరి శ్వాస వరకు రామనామం వదల్లేదని తన లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఆ లేఖలో ఏం ఉందంటే?
“మోదీ జీ మీరు చేస్తున్న దీక్ష పవిత్రమైన కార్యక్రమం మాత్రమే కాదు, రాముడికి భక్తితో సమర్పించే అత్యున్నత ఆధ్యాత్మిక క్రతువు. రాముడు తన జీవితంలో పాటించిన విలువలు, ధైర్యం, కరుణ, విధి నిర్వహణపై దృష్టిపెట్టడం వంటి అంశాలు ఈ అద్భుతమైన ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన ఉత్తమ అంశాలను శ్రీరామ ప్రభువు సూచించారు. రాముడి జీవితం, ఆయన పాటించిన సూత్రాలు దేశ చరిత్రలోని అనేక అంశాలను ప్రభావితం చేయటం సహా దేశ నిర్మాతలను ప్రేరేపించాయి. సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తుకు వస్తుంది” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన లేఖలో రాశారు.
President Droupadi Murmu writes to Prime Minister Narendra Modi on the eve of pranpratishtha ceremony at Ayodhya Ram Temple. pic.twitter.com/GQkWgNSHwA
— ANI (@ANI) January 21, 2024