చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ రికార్డు: రాష్ట్రపతి

-

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. పార్లమెంటు నూతన భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త పార్లమెంటులో నా తొలి ప్రసంగం అంటూ ముర్ము తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైందని అన్నారు. శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. భగవాన్‌ బిర్సాముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నామని తెలిపారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని వ్యాఖ్యానించారు.

“చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్‌ దిగ్విజయంగా ప్రయోగించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 ప్రవేశించింది. జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. ఆసియా పారా క్రీడల్లో భారత్‌ 111 పతకాలు సాధించింది. భారత్‌లో తొలిసారిగా నమో భారత్‌ రైలును ఆవిష్కరించాం.” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news