రామమందిర నిర్మాణం ఎంతో గొప్ప ఘట్టం – రాష్ట్రపతి ద్రౌపది

-

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం కొనసాగిస్తున్నారు.. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారి గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం అయింది. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇది నా తొలి ప్రసంగం అన్నారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనదని తెలిపారు.

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్‌, ఆసియా క్రీడల్లో తొలిసారి వందకుపైగా పతకాలు సాధించామన్నారు. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది, జీ-20 సమావేశాలు విజయవంతం అయ్యాయని వెల్లడించారు. రీఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం.. గరీబ్‌ హఠావో అనే నినాదాలు మాత్రమే విన్నాం.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేశాం.. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎంతో గొప్ప ఘట్టం అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news