ప్రధాని మోడీ అంబేద్కర్ వారసుడు: బండి సంజయ్

-

రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.తల్లిగా దేశానికి ద్రౌపది ముర్ము సేవ చేస్తారని ఆకాంక్షించారు.ప్రధాని మోదీని అంబేద్కర్ వారసుడితో బండి సంజయ్ పోల్చడం గమనార్హం.మోదీ నిర్ణయాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ తృప్తి చెందుతారు అని పేర్కొన్నారు.

జూలై 3న సికింద్రాబాద్ ప్రధాని మోదీ సభకు గిరిజన, ఆదివాసీలు భారీగా తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.మైనారిటీ వర్గానికి చెందిన కలాం ను, ఎస్సీ వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ ను, రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనన్నారు.ప్రధాని మోదీ, జేపీ నడ్డా ల కృషితోనే ఆదివాసీ మహిళా రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ కొనియాడారు.కాగా నేడు ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది మూర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version