భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. యువరాజు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా తమ వల్ల కాలేదు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్ననేను కేంద్ర మంత్రులకు కలిసే అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ గుజరాత్ ఎంతో నష్టం చేసిందన్నారు. కరోనాకి ముందు ప్రపంచం ఓడినా మనం గెలిచామన్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పై మండిపడ్డారు. నెహ్రు కాలం నుంచి యూపీఏ వరకు కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో మీరు చూశారు. కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయింది. సామాజిక న్యాయం పై కాంగ్రెస్ పాఠాలు చెప్పడం విచిత్రంగా ఉంది అన్నారు. బానిసత్వానికి నేను వ్యతిరేకం. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందన్నారు. మీ హయాంలో ఎల్ఐసీ ఎక్కడుంది..? ఇప్పుడు ఎల్ఐసీలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు ప్రధాని. పీఎస్ యూలు రికార్డు స్థాయిలో లాభాలను అర్జిస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఇప్పటివరకు లాంచ్ చేయలేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.