ప్రధాని మోదీ విదేశీ పర్యటన తేదీలు ఖరారు అయింది. జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఘనా, ట్రినిడాడ్-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు మోదీ. జులై 2, 3వ తేదీల్లో ఘనాలో మోదీ.. మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం కావడం విశేషం.

3, 4 తేదీల్లో ట్రినిడాడ్-టొబాగోలో మోదీ పర్యటించనున్నారు.. 1999 తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 4న అర్జెంటీనాకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. రియోడీజనీరో వేదికగా 6-7 తేదీల్లో జరిగే బ్రిక్స్ 17వ సదస్సులో పాల్గొననున్నారు మోదీ. ఈ మేరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటన తేదీలు ఖరారు అయింది.