ఘనంగా ఒలింపిక్స్‌ ప్రారంభం… ప్రధాని అభినందన!

-

కరోనా నేప«థ్యంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఒలింపిక్‌ క్రీడాలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడాల ఓపెనింగ్‌ సెరిమోనీలో భారత బృందం క్రీడాకారులు మువ్వన్నె జెండాతో పాల్గొన్నారు.

టోక్యోలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు జపాన్‌ చక్రవర్తి నరమితో ప్రారంభించారు. కేవలం వేయ్యి మంది అతిథుల మధ్య ఆరంబోత్సవం జరిగింది. ఈ వేడుకలో భారత పురుషుల హాకీ టీం కెప్టెన్‌ మన్‌ప్రిత్‌ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర మేరీకోం భారత జెండాను పట్టుకుని క్రీడాకారులను ముందుకు నడింపించారు. క్రీడాల ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారికి ట్వీటర్‌ వేదికగా భారతీయ క్రీడాకారులకు అభినందించారు. భారత జాతీయ గీతం ఆలపించినపుడు ఆయన పైకి లేచి నిల్చుండంతోపాటు వారిని చప్పట్లతో అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news