రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అటవీ అధికారుల ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామస్తులు దాడి చేసినట్లు సమాచారం.ఆదివారం తెల్లవారుజామున కేశవపట్నంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించగా.. పలువురి ఇళ్లలో కలప దుంగలు,ఫర్నిచర్ లభ్యమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు కలప దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అటవీ అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో జాధవ్ నౌశిలాల్ అనే బీట్ ఆఫీసర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతేకాకుండా అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు కేశవపట్నం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాగా, దాడి విషయాన్ని అటవీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.