బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని వనదుర్గ పెద్దమ్మ కళ్యాణ మండపంలో జరిగిన డ్వాక్రా రుణాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటి కాకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఎందుకురాలేదు.. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ పడలేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ వ్యక్తి సీఎం రమేష్ కి కేటీఆర్ ఎందుకు సవాల్ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. పదేళ్ల పరిపాలన లో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు రేషన్ కార్డులు ఇస్తుంటే.. అది చూసి ఓవర్వలేక ప్రభుత్వం పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.