ఆన్సర్ షీట్ లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. పాస్ చేసిన ప్రొఫెసర్ తొలగింపు

-

పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాకుండా.. ఆన్సర్ షీట్ మొత్తం జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపారు కొందరు విద్యార్థులు. అయినా వారు 56% మార్కులతో పాస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వీర్‌ బహదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. బుధవారం రోజున  విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కమిటీలో డా. అశితోష్‌ గుప్తా, డా.వినయ్‌ వర్మలు తప్పుడు మూల్యాంకనానికి పాల్పడ్డారని నిర్ధారణ అయినట్లుగా వర్సిటీ ఉపకులపతి వందనా సింగ్‌ తెలిపారు. దీంతో వీరిద్దరిని విధుల నుంచి తప్పించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

సమాధాన పత్రాల్లో జై శ్రీరాం పేర్లు రాసినట్లు గుర్తించిన నలుగురు ప్రథమ సంవత్సర విద్యార్థుల నుంచి ఆచార్యులు డబ్బులు తీసుకున్నారా? లేదా అన్న విషయమై దర్యాప్తు కొనసాగుతుందని వందనా సింగ్ తెలిపారు. యూనివర్సిటీలో డీ ఫార్మసి చదువుతున్న విద్యార్థులు తప్పు సమాధానాలు రాసినప్పటికీ ఉత్తీర్ణులయ్యారని తెలుసుకున్న ఓ పూర్వ విద్యార్థి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

Read more RELATED
Recommended to you

Latest news