పంజాబ్‌లో కల్తీ మద్యం కలకలం.. 20కి చేరిన మృతుల సంఖ్య!

-

ఎన్నికల ముంగిట పంజాబ్‌లో కల్తీ మద్యం మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని సంగ్రూర్ సివిల్ సర్జన్ కిర్పాల్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 20కి పెరిగినట్లు చెప్పారు. జిల్లాలోని గుజ్రాన్, ఉపాలి, దండోలి గ్రామాల్లో 11 మంది మరణించగా.. శుక్రవారం సునమ్‌లో ఐదుగురు మృతి చెందారు. తాజాగా శనివారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరో 11 మంది పాటియాలాలోని రాజింద్ర ఆస్పత్రిలో, ఆరుగురు సంగ్రూర్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో ఒక మహిళ సహా నలుగురిని అరెస్టు చేసినట్లు సంగ్రూర్ ఎస్ఎస్పీ సర్తాజ్ సింగ్ చాహల్ తెలిపారు. వీరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరితో పాటు ప్రధాన నిందితుడు గుర్లాల్ సింగ్, అతని ముగ్గురు సహచరులు ఇప్పటికే సంగ్రూర్ పోలీసుల అదుపులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news