పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలనే ఉద్దేశంతో కేంద్రంలో మోదీ సర్కార్ను గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధినేత భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ మణిపుర్‌లోని ఇంఫాల్ నుంచి ముంబయి వరకు కొనసాగించనున్నారు. 66 రోజుల పాటు 6713 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగనుంది.
రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్
ఈ నెల 14న మధ్యాహ్నం 12.30 గంటలకు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఇంఫాల్‌లో ప్రారంభమవుతుంది.
మణిపుర్‌లో 107 కిలోమీటర్ల దూరం యాత్ర ఉంటుంది.
ఆ తర్వాత నాగాలాండ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మీదుగా సాగుతుంది.
మొత్తం 15 రాష్ట్రాల గుండా ఈ యాత్ర సుమారు 6,713 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది.
పట్టణ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రోజుకు 9-10 కిలోమీటర్ల దూరం పాదయాత్ర ద్వారా ప్రజలను కలుస్తారు.
మొత్తం 110 జిల్లాల్లో 100 లోక్‌సభ, 337 అసెంబ్లీ స్థానాలను ఈ యాత్ర స్పృశిస్తుంది.