నేడు మణిపుర్‌లో రాహుల్‌గాంధీ భారత్‌ న్యాయయాత్ర ప్రారంభోత్సవం

-

ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కార్ను గద్దె దించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు మణిపుర్‌ నుంచి ప్రారంభమవనున్న ఈ యాత్రను బస్సులో, కాలినడకన రాహుల్ సాగించనున్నారు. మణిపుర్ నుంచి ముంబయి వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి 67 రోజుల పాటు 6,173 కిలోమీట్ల మేర రాహుల్ యాత్ర సాగుతుంది.

15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగుతుంది. ముందుగా నిర్ణయించినట్లు మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి కాకుండా తౌబాల్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు గ్రౌండ్‌ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలందరూ భారత్ జోడో న్యాయ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు 100 లోక్‌సభ స్థానాలు 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. మణిపుర్‌లో ప్రారంభంకానున్న యాత్ర ముంబయిలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. ఈరోజు మణిపుర్లో ప్రారంభం కానున్న ఈ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news