ఇటీవల అమెరికాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్ లోని సిక్కులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. వాషింగ్టన్ డిసి శివార్లలో హండన్ లో నిర్వహించిన కార్యక్రమంలో సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వార్ కు వెళ్లగలుగుతున్నారా..? అనే విషయాలపై భారత్ లో ఘర్షణలు జరుగుతున్నాయని.. అక్కడ తలపాగా ధరించి ఉన్న ఓ వ్యక్తిని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు.
అయితే సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్రమంత్రి రవ్ ణీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలలో సిక్కులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు రాహుల్ గాంధీని నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని, ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర మంత్రి రవ్ నీత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.