హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “లై” అనే సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ లై సినిమా తర్వాత చల్ మోహనరంగా, రాజ రాజ చోరా, రావణాసుర వంటి పెద్ద సినిమాలలో చాన్సులు దక్కించుకుంది.
అయితే ఆ మధ్య ఈమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన వ్యక్తిగత జీవితం పై దృష్టి సారించింది. ఈమె కొన్నాళ్లుగా తమిళనాడుకు చెందిన బిజినెస్మెన్ సాయి విష్ణుతో ప్రేమలో ఉంది. గత నెలలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట వివాహ బంధం లోకి అడుగుపెట్టింది.
సెప్టెంబర్ 15న మేఘా ఆకాష్ పెళ్లి ఆమె ప్రియుడు సాయి విష్ణుతో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. చెన్నైలో గ్రాండ్ గా జరిగిన వీరిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ దంపతులకు నెటిజెన్లు “హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.