దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం : రాహుల్ గాంధీ

-

దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నాగపూర్‌లో కాంగ్రెస్‌ అవిర్భావ సభ గ్రాండ్ గా సాగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ… మా పోరాటం బీజేపీపైనే అన్నారు. బీజేపీ ఎంపీల్లో భయం కనబడుతోందని వెల్లడించారు.

rahul gandhi

అధికారం కోసం బీజేపీ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ కిందిస్థాయి కార్యకర్త మాట కూడా వింటుందని వెల్లడించారు. బీజేపీ ఎంపీల అభిప్రాయాలకు ఆ పార్టీలో విలువ లేదన్నారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి ఉన్న తేడా అదే అన్నారు రాహుల్‌ గాంధీ.

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగనన నిర్వహించి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలోని సాధారణ ప్రజలకు రాజకీయ అధికారాన్ని అప్పగించడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. పలు రంగాలలో బీసీలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాధాన్యతం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news