విజయ్‌కాంత్ నా ప్రాణాలను కాపాడారని గుర్తు చేసుకున్నారు విజయశాంతి. విజయ్‌కాంత్ మృతి పట్ల విజయశాంతి సంతాపం తెలిపారు. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇలా పంచభూతాల ప్రమాదాల నుంచి నేను బయటపడ్డాను ఎన్నోసార్లు ఆ దైవం బతుకమని ఇచ్చిన వరంతో ఇయ్యాల్టి దంక అంటూ పేర్కొన్నారు. వాటిల నిప్పు ప్రమాదం 1980 ప్రారంభం ల ఒక తమిళ సినిమా షూటింగ్ల జరిగిందన్నారు.
ఒక (వేరుశనగ కావచ్చు బహుశా) తోటల నన్ను కట్టి, నిప్పు చుట్టుతా పెట్టి అంటించిన సన్నివేశంల , అక్కడొచ్చిన పెద్ద గాలికి మొత్తం ఆ ప్రాంతం అంటుకు పోయింది. నా చేతులు పొరపాటున గట్టిగ కట్టివేయబడటంవల్ల తప్పించుకోలేని పరిస్థితి అని తెలిపారు. ఆ సమయంల విజయ్‌కాంత్‌గారు ఎంతో కష్టంతో దూసుకొచ్చి కట్లు విప్పి నన్ను కాపాడటం జరిగిందని వివరించారు. తరవాత పెద్ద స్టార్స్ అయ్యాక కూడా ఒకరమంటే మరొకరం ఎంతో మర్యాదతో వ్వవహరించే వాళ్ళం అన్నారు. మీరంటే నాకు ఎన్నటికీ గౌరవమే విజయకాంత్ గారు, మీ గురించి RIP లాంటి మాట రాయలేను, మీరు ఎక్కడున్నా బావుండాలని కోరారు.