కరెంట్ ఛార్జీలు పెరగడానికి కారణం అదానీయే : రాహుల్ గాంధీ

-

మోదీ సర్కార్​పై.. అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. భారత్​లో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం అదానీయేనని అన్నారు. కరెంట్ బిల్లుల రూపంలో అదానీ ఇప్పటి వరకు దేశ ప్రజల నుంచి 12వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆయన ఎన్ని తప్పులు చేస్తున్నా.. మోదీ సర్కార్ ఆయనకు వంత పాడుతుందే తప్ప.. ప్రశ్నించదని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వానికి.. అదానీకి మధ్య ఏదో రహస్య ఒప్పందం నడుస్తోందని ఆరోపణలు చేశారు.

“విదేశాల నుంచి కొనుగోలు చేసిన బొగ్గును దేశంలో రెట్టింపు ధరకు విక్రయించటం వల్ల….విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయి. ఈ విషయం ప్రజలంతా అర్థం చేసుకోవాలి. బొగ్గు ధరల పెరుగుదలపై లండన్‌కు చెందిన ఫైనాన్సియల్‌ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని చూడండి. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ మౌనం వీడటంతోపాటు దర్యాప్తు జరిపించాలి. అదానీ ఇండోనేషియాలో బొగ్గు కొనుగోలు చేస్తారు. ఆ బొగ్గు భారత్‌ చేరేసరికి ధర డబుల్ అవుతుంది. ఈ విధంగా దాదాపు 12వేల కోట్లు దేశ ప్రజల నుంచి అదానీ దోచుకున్నారు. బొగ్గు రేటు పెంచటం వల్ల విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయి. దీనికి కారణం అదానీ అని తేలింది.” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news