ఈ రోజు వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లు పోటీ పడనున్నాయి. చెన్నై లోని చిదంబరం స్టేడియం లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహిధి బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఇంగ్లాండ్ కు షాక్ ఇవ్వడంతో అందరూ ఈ మ్యాచ్ పై చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక చెన్నై పిచ్ ఎక్కువగా స్పిన్ కు సహకరించడం మరియు బ్యాటింగ్ కు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉండడంతో విజయావకాశాలు న్యూజిలాండ్ కె ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ కు విలియమ్సన్ మరోసారి దూరం కావడం నిరాశపరిచి అంశం అని చెప్పాలి. విలియమ్సన్ బదులుగా విల్ యంగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆఫ్గనిస్తాన్ మాత్రం ఇంగ్లాండ్ పై గెలిచిన జట్టునే కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ చేయనున్న న్యూజిలాండ్ ఆఫ్గనిస్తాన్ ముందు ఎంత టార్గెట్ పెడుతుందో చూడాలి.
నిన్నటి మ్యాచ్ లో సైతం సౌత్ ఆఫ్రికా కు నెదర్లాండ్ భారీ షాక్ ఇచ్చింది. కాబట్టి ఎవరినీ అంత తేలిగ్గా తీసుకోకూడదు.