విరాట్ ని చూసి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి: రోహిత్

-

రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మీద భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించారు. క్రికెట్ మీద కోహ్లీ కి ఉన్న అభిరుచి అంకితభావం అద్భుతం అని చెప్పారు రోహిత్ ఎప్పుడూ కూడా పరుగులు దాహంతో విరాట్ కోహ్లీ ఉంటాడని కెరియర్ లో ఎప్పుడూ విరాట పునరావాసం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లలేదని ఫిట్నెస్ కి ఇది ఒక నిదర్శనం అని అన్నారు. కోహ్లీని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలని చెప్పారు రోహిత్ శర్మ.

జియో సినిమాలో దినేష్ కార్తీక్ తో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ ఈ విషయాలని చెప్పారు విరాట్ కోహ్లీని దగ్గర నుండి చూడడం నా అదృష్టమని భావిస్తున్నాను అని అన్నారు. కోహ్లీకి ఆటపై ఉన్న మక్కువ ఎంతో అని చెప్పారు ఏ సమయంలో అయినా సరే జట్టు కోసం గొప్పగా పోరాడుతాడు అని చెప్పారు అలానే అంకితభావంతో ఉంటాడని కోహ్లీని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలని రోహిత్ శర్మ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news