వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ టీమిండియా మరో ఫైట్ కు రెడీ అయింది. ఈ ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో ఇవాళ టీమ్ ఇండియా తెలపడనుంది. ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది.
అయితే.. ధర్మశాల వేదికగా ఇవాళ జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘవృత్తమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు 18° సెల్సియస్ ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, సెకండ్ ఇన్నింగ్స్ టైం లోను వరుణుడు ఆటంకం కలిగించొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.