మోదీ ప్రమాణ స్వీకారానికి సూప‌ర్ స్టార్ రజనీకాంత్

-

భార‌త ప్రధానిగా న‌రేంద్ర‌ మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం అందింది. దేశంలోని ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా త‌మిళ న‌టుడు సూప‌ర్ స్టార్ రజనీకాంత్ కూడా మోదీ స్వీకారోత్సవం కోసం దిల్లీ వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయ‌బోవడం చాలా పెద్ద విజయం అని తలైవా అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకున్నారని చెప్పారు. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. దాని గురించి త్వ‌ర‌లో అప్‌డేట్ ఇస్తా అంటూ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version