రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి కన్నుమూత

-

దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన సంథాన్‌ కన్నుమూశాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంథాన్ అలియాస్ సుతేంద్ర రాజా చెన్నైలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. 55 సంవత్సరాల సంథాన్‌ 1991లో రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషీగా తేలి 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022లో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కాలేయ వైఫల్యానికి చికిత్స తీసుకుంటున్నాడు.

ఈరోజు తెల్లవారుజామున సంథాన్‌కు గుండెపోటు వచ్చిందని. సీపీఆర్ చేసి అతడిని బతికించామని రాజీవ్‌ గాంధీ ఆస్పత్రి డీన్ తెరని రాజన్ తెలిపారు. తర్వాత అతడిని వెంటిలేటర్‌పై ఉంచామని, చికిత్సకు అతడి శరీరం స్పందించలేదని వెల్లడించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సంథాన్‌ తుది శ్వాస విడిచినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news