నేవీ, ఎన్సీబీ ఆపరేషన్.. వెయ్యికోట్లకుపైగా విలువైన 3,300 కిలోల డ్రగ్స్ సీజ్

-

దేశంలో మత్తు పదార్థాల కట్టడికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు, నార్కోటిక్ అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా ఇండియన్ నేవీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు.

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఐఎన్ఎఫ్, ఏటీఎస్, ఎన్సీబీ సంయుక్తంగా భారీ ఆపరేషన్‌ నిర్వహించి 3,300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ డ్రగ్స్‌ను ఇరాన్‌, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3,300 కిలోల డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. అందులో నలుగురు ఇరాన్ దేశస్థులు ఉన్నారని చెప్పారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news