బ్రేకింగ్‌: ఆయుర్వేద బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

-

ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీస‌ర్చ్ ఇన్ ఆయుర్వేద బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. ఇవాళ ఆయుర్వేద బిల్లుపై వివిధ పార్టీల ఎంపీలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. బిల్లుపై మాట్లాడిన ఎంపీల‌కు ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

ఆధునిక వైద్యంలో డాక్ట‌ర్ అయినా.. ఆయుర్వేదంతో పాటు ఇత‌ర సాంప్ర‌దాయ వైద్య విధానాల‌ను తాను ప్ర‌శంసిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. జామ్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఇన్స్‌టిట్యూట్‌కు సంబంధించి మంత్రి క్లారిటీ ఇచ్చారు. దేశంలోని ఇత‌ర సంస్థ‌ల‌కు కూడా గౌర‌వం ఇస్తున్నామ‌న్నారు. జాతీయ ప్రాముఖ్య‌త క‌లిగిన ఆరోగ్య సంస్థ‌లు దేశంలో 103 ఉన్నాయ‌ని, కానీ ఆయుర్వేద‌కు ఏదీ లేద‌ని ఆయ‌న తెలిపారు. జామ్‌న‌గ‌ర్ ఆయుర్వేద కాలేజీకి జాతీయ హోదా ఇవ్వ‌డంలో ప‌క్ష‌పాతం లేద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version