Ram Lalla jewellery : రాముడి కిరీటం విలువ ఎంతో తెలుసా?

-

Ram Lalla jewellery : అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు స్వర్ణ ఆభరణాలతో కాంతులీనుతున్నారు. విగ్రహానికి అమర్చిన కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని విలువ రూ. 11 కోట్లు. సూరత్ కు చెందిన డైమండ్స్ వ్యాపారి ముఖేష్ పటేల్ రాములోరికి కానుకగా ఇచ్చారు.

Ram Lalla jewellery

ఆరు కేజీల బరువున్న ఈ కిరీటాన్ని నాలుగున్నర కిలోల బంగారంతో పాటు వజ్రాలు, కెంపులు, ముత్యాలు, నీలమనులతో తయారుచేశారు. కాగా అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు రకాల కానుకలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా రామ్ లల్లాకు కానుకలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బాల రాముడికి దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు అందజేస్తున్నారు. రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి, ఆయన కుటుంబం ముందంజలో ఉంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news