కేంద్ర కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. ఆయన ఇటీవలే ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గుండెకు సంబందించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పోషించిన ఆయన దేశంలోని ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. ఆయన మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ ట్వీట్ ద్వారా తెలిపారు. మిస్ యు పాపా అంటూ, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాస్వాన్ తన తండ్రి మరణం గురించి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.